నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చర్యలు


Sat,May 25, 2019 11:50 PM

నిర్మల్ అర్బన్,నమస్తే తెలంగాణ : నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభం కానుండడంతో వ్యవసాయ దారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా పరిధిలో నాసిరకం విత్తనాలను నియంత్రించడం చర్యలు చేపట్టాలని గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్మల్ జిల్లా పరిధిలో సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాప యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని నాణ్యమైన విత్తనాలను, ఎరువులను రైతులకు అందించాలని సూచించారు. కల్తీ విత్తనాలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని మార్కెట్‌లో బీటీ 3 విత్తనాలకు అనుమతి లేదని అనుమతి లేని విత్తన విక్రయాలదారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. విత్తన డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని తప్పని సరిగా బిల్ అడిగి తీసుకోవాలన్నారు.గ్రామాల్లోకి వచ్చే వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఎవరైన అమ్మడానికి వస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు, వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ దక్షిణ మూర్తి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ జాన్‌దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...