పులుల ఆవాసానికి ఏర్పాట్లు షురూ


Sat,May 25, 2019 11:50 PM

-రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్‌టౌన్: రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకొని అధిక పంట దిగుబడులు సాధించాలని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సబ్సిడీపై సో యా, జీలుగ విత్తనాల పంపిణీని శనివారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ వానాకాలంలో జిల్లా రైతులు 50వేల హెక్టార్లలో సోయా, 10వేల హెక్టార్ల పచ్చిరొట్ట సాగు చేస్తారనే అంచనాతో అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచామన్నారు. సబ్సిడీ విత్తనాల పంపిణీలో పారదర్శకత పాటించాలని, జిల్లాలో 44 విత్తన పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులు పట్టాపాస్ పుస్తకాలు వెంట తీసుకెళ్లి టోకెన్లు పొందాలని సూచించారు. విత్తన పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని శాఖ సిబ్బందికి సూచించారు. జిల్లాకు ఇప్పటికే 39వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు వచ్చాయని, వాటిని గోదాంలో నిల్వ చేశామన్నారు. సోయా విత్తనాలు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి కోటేశ్వర్‌రావు, ఏడీఏ వినయ్‌బాబు, మార్కెట్‌కమిటీ చైర్మన్ ధర్మాజి రాజేందర్, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ ధర్మాజి శ్రీనివాస్, ఏవోలు వసంత్, నాగరాజు, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...