నాణ్యమైన విత్తనాలే అమ్మాలి


Sat,May 25, 2019 02:38 AM

తానూర్ : దేశానికి అన్నం పెట్టే రైతన్నను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందించాలని నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని ఉమ్రి (కే) గ్రామంలో గల గోదాములో కాలం చెల్లిన క్రిమిసంహారక మందులు నిల్వ ఉన్నాయనే సమాచారం మేరకు తనిఖీ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. రూ. 3,21,949 విలువ చేసే క్రిమి సంహారక మందులు, 4,95,650 విలువ చేసే ఇతర మందు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవీ గడువు తీరినవిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కొన్ని నాసిరకం విత్తనాలు మార్కెట్లోకి వచ్చినట్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తమ సిబ్బంది నిరంతరం తనిఖీలు చేపడుతుందన్నారు. ప్రతి విత్తన, పురుగు మందులు విక్రయించే సమయంలో వ్యాపారులు రైతులకు ఒరిజినల్ రసీదులు ఇవ్వాలన్నారు. కాలం చెల్లిన మందులు నిల్వ ఉంచిన వ్యాపారి కదం దత్తాత్రిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. దుకాణాన్ని వ్యవసాయ అధికారులతో కలిసి పోలీసులు సీజ్ చేశారు. ఆయన వెంట డీఎస్పీ రాజేశ్ భల్లా, సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకట్‌రెడ్డి, ముథోల్ ఏడీఏ అంజిప్రసాద్, ఏవో నరేశ్, సిబ్బంది ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...