పరిషత్ ఓట్ల లెక్కింపు వాయిదా


Sat,May 25, 2019 02:37 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఈ నెల 27న జరగాల్సిన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. ఈ మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని జడ్పీటీసీ, 156 ఎంపీటీసీ స్థానాలకు గాను.. మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ బాక్సులను నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మండల కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూంలలో పోలీసు బందోబస్తు మధ్య భద్రపరిచారు. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం ఈ నెల 27న కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బందిని నియమించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాలను సైతం గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేశారు. 27న జరగాల్సిన కౌంటింగ్ వాయిదా పడగా.. ఎన్నికల కమిషన్ తిరిగి ఎప్పుడు ఓట్లను లెక్కించాలనే విషయంలో తేదీలను ప్రకటించాల్సి ఉంది.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...