ఇంకా తెలవారదేమి..?


Thu,May 23, 2019 01:56 AM

-అభ్యర్థుల్లో టెన్షన్.. క్యాడర్‌లో ఉత్కంఠ
-మరి కాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్
-42రోజుల నిరీక్షణకు కొద్ది గంటల్లో తెర
-బెట్టింగ్ రాయుళ్లలో మొదలైన ఆందోళన

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గడియ రానే వ చ్చింది. ఆదిలాబాద్ లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్ర క్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు నిర్వహించగా.. 42రోజు ల విరామం తర్వాత నేడు ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుండగా.. ఇందుకోసం జిల్లాల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంజయ్‌గాంధీ పాల్‌టెక్నిక్ కళాశాలలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను ఏర్పాటు చేశారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజక వర్గాలకు రెండు హాళ్లను సిద్ధం చేశారు. టీటీడీసీలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును చేపడుతారు. మూడు కేంద్రాల్లో లెక్కింపు కోసం సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుండగా.. ఆయా కేంద్రాల్లో ఆయా జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో మూడంచెల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

లోక్‌సభ ఫలితాలపై అటు అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ ఉండగా.. ఇటు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఫలితాలపై ఎవరికి వారు తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెబుతుండ గా.. మరి కాసేపట్లో అదృష్టం ఎవరిని వరించనుం దో తేలిపోనుంది. గెలిచేదెవరో ఓడేదెవరో.. మరి కొన్ని గంటల్లో స్పష్టం కానుంది. ఇప్పటికే గ్రా మాలు, మండలాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తమకు పడిన ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలు వేస్తున్నారు. ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉండగా.. మధ్యాహ్నం 12గంటల వరకు గెలిచేదెవరో తేలిపోనుంది. 42రోజుల నిరీక్షణకు గురువారం మధ్యాహ్నంతో తెరపడనుంది. బుధవారం రాత్రంతా అభ్యర్థులు నిద్రలేకుండా గడిపారు. ఇంకా తెలవారదేమి అంటు నిద్రలేకుండా తిరిగారు. బుధవారం సాయంత్రానికే ఆయా పార్టీ ల ముఖ్య నాయకులు, ఏజెంట్లు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడే రాత్రి బసచేసి గురువారం ఉదయమే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎవరికి వారు గెలుస్తామని ప్రధాన పా ర్టీల అభ్యర్థులు ధీమాతో ఉన్నప్పటికీ ఎగ్జిట్‌పోల్ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

మరో వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జిల్లాలో పెద్దమొత్తంలో పందెం కాశారు. ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఎంత మెజార్టీతో గెలుస్తారు అనే దానిపై పెద్ద మొత్తంలో బెట్టింగ్ దందా సాగింది. రూపాయలు కోట్లలో బెట్టింగ్ చేశారు. గెలిచేదెవరు ఓడేదెవరో నేడు తేలిపోనుండడంతో బెట్టింగ్ దం దాకు తెరపడనుంది. నేడు లోక్‌సభ ఫలితాలు ఉండడంతో అటు బెట్టింగ్ రాయుళ్లతో పాటు ఇటు బెట్టింగ్ పెట్టిన వాళ్లలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీరంతా రాత్రి నిద్రలేకుండా జాగరణ చేయాల్సి వచ్చింది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రా రంభం అవుతుండగా.. మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడి కావడంతో అటు అభ్యర్థుల్లో గెలిచేదెవరో ఓడేదెవరో.. ఇటు బెట్టింగ్ దందాలో గెలిచేదెవరో, ఓడేదెవరో తేలిపోనుంది. ఏదేమైనా మరి కొద్ది గంటల్లో తీవ్ర ఉత్కంఠకు తెరపడనుంది.

మూడు కౌంటింగ్ కేంద్రాల వద్ద ముగ్గురు అబ్జర్వర్‌లను నియమించారు. ఆదిలాబాద్, బోథ్‌కు రాబిన్, ఆసిఫాబాద్, సిర్పూర్‌కు సంజయ్‌కుమార్ సింగ్, నిర్మల్, ముథోల్‌కు అబ్దుల్ వహీద్, ఖానాపూర్‌కు మళ్లిక నాగంనగర్‌లను నియమించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద వెబ్‌కెమెరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి అనుసంధానం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ మూడు కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించనున్నారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత..
కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఏడు నియోజకవర్గాల పోలీసు సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. మొత్తం 1100ల మంది పోలీసులు విధు ల్లో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏడు నియోజకవర్గాల నుంచి భారీ సం ఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఉమ్మడి జిల్లా కేంద్రానికి తరలిరానుండగా.. పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కౌంటింగ్ హాల్‌లోకి సెల్‌ఫోన్‌ను నిషేధించారు. కౌంటింగ్ కేంద్రాల గుం డా జిల్లా కేంద్రానికి వచ్చే దారులన్నింటిని మళ్లించారు. అనుకుంట వైపు నుంచి వచ్చే వాహనాలను ఏరోడ్రం గ్రౌండ్ నుంచి ఖానాపూర్ మీదుగా దారి మళ్లించారు. పిట్టల్‌వాడ నుంచి వచ్చే వాహనాలను దస్నాపూర్, భారత్ పెట్రోల్ బంక్ మీదుగా దారి మళ్లించారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇతర పోలీస్ స్టేషన్ల సిబ్బందిని ట్రాఫిక్ విధుల్లో నియమించనున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...