లెక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తు


Thu,May 23, 2019 01:53 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లె క్కింపు ప్రారంభం కానుండగా.. బుధవారం ఆదిలాబా ద్‌లోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మూడు జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు. వెయ్యి మంది పోలీసులకు వివిధ విభాగాల్లో విధులు కేటాయించారు. బందోబస్తును ఆయా జిల్లాల ఎస్పీలు కౌంటింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షించనున్నారు. పట్టణంలో ఐదుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి లెక్కింపు అయ్యేంత వరకు వాహనాల తనిఖీలు చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి పాసులు ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు.

సమావేశంలో ముగ్గురు ఎస్పీలు...
ఆదిలాబాద్‌లో బుధవారం నిర్వహించిన సమావేశానికి మూడు జిల్లాల ఎస్పీలు విష్ణువారియర్ (ఆదిలాబాద్), సి.శశిధర్‌రాజు (నిర్మల్), ఎస్.మల్లారెడ్డి (కుమ్రంభీం ఆసిఫాబాద్) హాజరయ్యారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయగా.. పట్టణంలో పూర్తి స్థాయి ఆంక్షలు విధించారు. ఓట్ల లె క్కింపు పూర్తయ్యే వరకు వెయ్యి మంది పోలీసులు వీధు ల్లో కొనసాగనున్నారు. అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా సాయుధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశారు.

ఆంక్షలు...
పార్లమెంట్ ఫలితాల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. బాబుజగ్జీవన్‌రాం చౌక్, అంకోలి గ్రామ శివారు, వైమానిక మైదానం, కేఆర్‌కే కాలనీ శివారు, జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్‌లోకి ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు ప్రజాప్రతినిధులు, మీడియాకు గుర్తింపు కార్డులు ఉన్న వారినే లోనికి అనుమతిస్తారు. కేఆర్‌కే కాలనీ, అనుకుంట గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. ఈ బందోబస్తులో ఎస్పీలు ముగ్గురు, అదనపు ఎస్పీలు ఐదుగురు, డీఎస్పీలు 10 మందితో పాటు సీఐలు, ఎస్సైలు తదితర సిబ్బంది పాల్గొంటారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...