మాక్ కౌంటింగ్ సక్సెస్


Thu,May 23, 2019 01:52 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : లోకసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం నిర్వహించనుండగా.. ఉమ్మడి జిల్లా కౌంటింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం మాక్ కౌంటింగ్‌ను నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సహాయకులు, సూపర్‌వైజర్‌లు, సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల నియమావళి మేరకు లెక్కింపు చేపట్టాలన్నారు. ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనపుడు ఆయా సహాయ రిటర్నింగ్ అధికారులకు తెలియజేయాలని అన్నారు. రౌండ్ల వారిగా ఫలితాలను ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు. ఈవీఎంలు మోరాయిస్తే సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కెమెరాలను రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి అనుసందానం చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ సమయంలో అధికారులు ఒత్తిడికి గురికావద్దన్నారు. నిబంధనల మేరకే కౌంటింగ్ చేపట్టాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు సకాలంలో హాజరు కావాలని తెలిపారు. జిల్లాల వారీగా ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా తాను మూడు జిల్లాల కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు సంజయ్‌కుమార్ సింగ్, అదనపు లెక్కింపు పరిశీలకులు మల్లికా నిగమ్ నగర్, రాబిన్ తప్పో, అబ్దుల్ రషీద్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య, జాయించ్ కలెక్టర్ సంధ్యారాణి, ఇతర సహాయ రిటర్నింగ్ అధికారులు, లెక్కింపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...