రైతులందరికీ సబ్సిడీ విత్తనాలు అందజేస్తాం


Thu,May 23, 2019 01:52 AM

నిర్మల్ టౌన్: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో రైతులందరికీ సబ్సిడీ విత్తనాలు అందజేయనున్న ట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి కోటేశ్వర్‌రావు తెలిపారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో 25 వేల క్విం టాళ్ల సోయాబీన్ విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 33శాతం సబ్సిడీపై ఈ విత్తనాలు రైతులకు అందజేస్తామని అన్నా రు. రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో వ్యవసాయశాఖ కార్యాలయంలో ఈనెల 25 నుంచి పొందవచ్చని వివరించారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ అన్ని చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా రసీదును పొందాలని సూచించారు. జిల్లాకు 39వేల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు అందుబాటులో ఉందని తెలిపారు. 33శాతం సబ్సిడీపై 30కిలోల బస్తాకు సబ్సిడీపై రూ. 1095కు పొందాలన్నారు. జీలుగు 5 వేల క్వింటాళ్లు వచ్చిందని సబ్సిడీపై రూ. 550 చెల్లించి పొందాలన్నారు. సోయాబీన్, జీలుగ విత్తనాల పంపిణీకి జిల్లాలోని ఆయా మండలాల్లో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సబ్సిడీ విత్తనాలు పక్కదారి పట్టకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అర్హులైన రైతులకు మాత్రమే అందించడం జరుగుతుందన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...