ఎస్సైపై దాడి చేసిన వారిని శిక్షించాలి


Thu,May 23, 2019 01:52 AM

ఇంద్రవెల్లి : పాత కేసులో నిందితులను అరెస్టు చేయడానికి వెళ్లిన ఎస్సై గంగారామ్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కా బాపురావ్ అన్నారు. బుధవారం మండలంలోని ముత్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన తుడుందెబ్బ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై దాడి చేయడం సరికాదన్నారు. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజనులు అనేక ఉద్యమాలు చేశారని కానీ పోలీసులకు వ్యతిరేకంగా ఎప్పుడు పని చేయలేదన్నారు. భారత రాజ్యాంగంలోని చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తేనే సమాజంలో శాంతి వాతావరణం నెలకొంటుందన్నారు. విధినిర్వహణలో ఉన్న ఎస్సై గంగారామ్‌పై దాడి చేసిన వానికి కఠినంగా శిక్షించాలన్నారు. కలెక్టర్, ఎస్పీ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు మెస్రం నాగ్‌నాథ్, మండల నాయకులు వెట్టి జాకు, గేడం భీమ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...