అదుపుతప్పి ఆటో బోల్తా


Thu,May 23, 2019 01:51 AM

బజార్‌హత్నూర్ : మండలంలోని ధరంపురి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలం కుంట గ్రామానికి చెందిన పెందూర్ గణపతి కుటుంబ సభ్యులతో కలిసి బజార్‌హత్నూర్ మండలం ధరంపురి గ్రామంలో నిర్వహించే ఫంక్షన్‌లో పాల్గొనడానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఒక దాని తర్వాత ఒకటి వస్తున్న ఆటోలు ఢీ కొనడంతో అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలైన గణపతి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆటోలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా, సాలేగూడ గ్రామానికి చెందిన తుకారంకు తీవ్రగాయాలవడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ధరంపురి గ్రామానికి చెందిన నర్సుబాయి, గంగామణి, అనంతపూర్ గ్రామానికి చెందిన తులసీరాం, సుగణాబాయి, రవి లకు స్వల్ప గాయాలవడంతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బజార్‌హత్నూర్ పోలీసులు తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...