కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి!


Wed,May 22, 2019 02:07 AM

-జూన్ మొదటి వారం నుంచి జారీ
-క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు
-ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 12,267
-7,411 దరఖాస్తు దారులకు రేషన్‌కార్డులు జారీ
-పెండింగ్‌లో 4,856 దరఖాస్తులు

నిర్మల్ టౌన్: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులను అందించేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ క్షేత్రస్థాయిలో కసరత్తును ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 396 గ్రామాలు ఉండగా రేషన్ షాపులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 2,05,189 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 35 అన్నపూర్ణ కార్డులు, 11,776 అంత్యోదయ , 1,93,378 ఫుడ్ సెక్యూరిటి రేషన్ కార్డులున్నాయి.వ్యాప్తంగా ఏడాది కాలంగా 12,267 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 7,411 దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను జారీ చేశారు. స్థానిక తహసీల్ కార్యాలయంలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు రావడంతో వారు వీఆర్వోల సమక్షంలో విచారణ జరిపి లబ్ధిదారులను గుర్తించి పౌరసరఫరాల శాఖకు రేషన్‌కార్డుల మంజూరు కోసం సిఫార్సు చేస్తున్నారు.

పారదర్శకంగా ఎంపిక
రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ. రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షా 50 వేలు వార్షిక ఆదాయం ఉన్న వారిని తెల్లరేషన్ కార్డుకు అర్హులుగా గుర్తించారు. వీర్వోల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీటిని రెవెన్యూ అధికారుల సహయంతో డీఎస్‌వో కార్యాలయానికి కొత్త రేషన్ కోసం లాగిన్ ద్వారా సిఫార్సు చేశారు. ఇప్పటివరకు 12,267 దరఖాస్తులు రాగా వీటిలో 7411 దరఖాస్తులను పరిశీలించిన రేషన్ కార్డులను జారీ చేశారు. మిగతా 4856 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇందులో 205 తహసీల్ కార్యాలయాల్లో, డీఎస్ కార్యాలయంలో 1086 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా పెండ్లి అయిన సభ్యులు సైతం ఉమ్మడి కుటుంబం నుంచి వేరు గా ఏర్పడి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

భారీగా దరఖాస్తులు
జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పౌరసరఫరా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పారదర్శకంగా రేషన్ సరుకులను ప్రతినెలా పంపిణీ చేస్తున్నది. ఈ-పాస్ విధానాన్ని అమలు చేయడమే కాకుం డా ఏ ప్రాంతంలో ఉన్నా నిత్యావసర సరుకులు అందించేందుకు చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ జూన్ నుంచి కార్డులు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...