ప్రీ రిహార్సల్‌..!


Tue,May 21, 2019 12:59 AM

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు నియోజకవర్గ కేంద్రాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, బోథ్‌, నిర్మల్‌, ముథోల్‌ ఉన్నాయి. ఏప్రిల్‌ 11న ఎన్నికలు నిర్వహించారు. అనంతరం కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌లను జిల్లా కేంద్రానికి తరలించి ఆదిలాబాద్‌, బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను టెక్నికల్‌ ట్రైనింగ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో, నిర్మల్‌, ఖానాపూర్‌, మథోల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను సంజయ్‌గాంధీ పాలిటెక్నిల్‌లో భద్రపర్చారు. కౌంటింగ్‌ కేంద్రాలు మూడు జిల్లాలకు స్ట్రాంగ్‌ రూంల వద్దనే ఏర్పాటు చేశారు. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. జిల్లాల వారీగా కౌంటింగ్‌కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో ప్రతి టేబుల్‌కు ఒక్కో ఈవీఎం చొప్పన 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఫలితాలను సువిధ వెబ్‌సైట్‌లో క్రోడీకరిస్తారు. results.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్తుంది. ఈ ఎన్నికల ఫలితాలను ఎక్కడి నుంచైనా తెలుసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ఓట్ల లెక్కింపు, వెబ్‌సైట్‌లో క్రోడీకరణ అంశాలపై కౌంటింగ్‌ అధికారులకు ఇప్పటికే జి ల్లాల వారీగా శిక్షణను ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 22న ఉమ్మడి జిల్లా కౌంటింగ్‌ అధికారులకు ప్రీ రిహార్సల్‌ (మాక్‌ కౌంటింగ్‌) శిక్షణను ఇవ్వనున్నారు.

మాస్టర్‌ ట్రైనర్లతో శిక్షణ..
ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు రోజులే సమ యం ఉండడంతో అధికారులు కౌంటింగ్‌కు సమాయత్తం అవుతున్నారు. కౌంటింగ్‌ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలపై ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కౌంటింగ్‌ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల వారీగా కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మాక్‌ కౌంటింగ్‌ కోసం కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌లను తెప్పించారు. ప్రత్యేక మాస్టర్‌ ట్రైనర్లతో కౌంటింగ్‌ అధికారులకు శిక్షణను ఇవ్వనున్నారు. గతంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు నియోజకవర్గానికి ఒక వీవీప్యాట్‌ను ఎంపిక చేసి అందులో స్లిప్పులు లెక్కించే వారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలకు నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్‌లను ఎంపిక చేసి అందులో స్లిప్‌లను ఎలా లెక్కించాలనే వంటి విషయాలపై కౌంటింగ్‌ అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు. వెబ్‌సైట్‌లో నమోదైన తర్వాత ఫలితాలు వెల్లడించిన తర్వాత ఏమైనా తప్పులు దొర్లితే రిటర్నింగ్‌ అధికారి లాగిన్‌లో ఎలా అప్‌డేట్‌ చేయాలనే విషయాలపై మాస్టర్‌ ట్రైనర్లు శిక్షణను ఇవ్వనున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...