మొక్కల పండుగకు సిద్ధంగా ఉండాలి


Tue,May 21, 2019 12:59 AM

దిలావర్‌పూర్‌: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్వహించనున్న మొక్కల పండుగ హరితహారం కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధంగా ఉంచాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఈజీఎస్‌ అధికారులు, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా హరిత హారం మొక్కలు, నర్సరీల ప్రగతిని అడిగితెలుసుకున్నారు. జూన్‌లో నిర్వహించనున్న హరిత హారం కార్యక్రమానికి ఆ గ్రామంలోని నర్సరీల ద్వారానే మొక్కలను అందించాలని, ఈ బాధ్యత సంబంధిత ఫీల్డ్‌ అసిస్టెంట్లదే అని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి నర్సరీలో రోజు వారీగా పురోగతి ఉండాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణకు పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రణాళిలను తయారు చేసుకోవాలని సూచించారు. అవరమైన రైతులకు టేకు ఇతర మొక్కలను అందించాలని అన్నారు. వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో అలసత్వం వీడాలని పనులు వేగవంతం చేయించాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాల్లో జాప్యంపై సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఏడాది కాలంగా చెబుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాగైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఈజీఎస్‌ ఏపీవో జగన్నాథం, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈసీ ప్రదీప్‌ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...