పోలీసులకు, నిందితుడి మధ్య వాగ్వాదం :ఉద్రిక్తత


Sun,May 19, 2019 01:14 AM

ఇంద్రవెల్లి: పాత కేసు విషయంలో అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై నిందితుడు, అతడి కుటుంబ సభ్యులు పోలీసులనుఅడ్డుకోవడంతో ఇంద్రవెల్లి మండలం లోని ఈశ్వర్‌నగర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2018 జూలై 23న పోలీసులు దాడి చేశారని ఆటో డ్రైవర్ ఘన్‌శ్యాం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో అతడితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విషయమై శనివారం ఇంద్రవెల్లి ఎస్సై గంగారామ్ తన పోలీస్ సిబ్బందితో ఈశ్వర్‌నగర్‌కు చెందిన ఘన్‌శ్యామ్ ఇంటికి వెళ్లారు. అతడిని అరెస్టు చేస్తుండగా బాధితకుటుంబ సభ్యులు పోలీసులను అడుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వవాదం జరిగింది. పోలీసులు తనతోపాటు కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టారని నిందితుడు ఘన్‌శ్యామ్‌తోపాటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి వచ్చేవరకు పోలీస్ వాహనాన్ని పోనివ్వమని పట్టుపడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఉట్నూర్ సీఐ వినోద్ ఈశ్వర్‌నగర్ గ్రామానికి చేరుకొని జరిగిన సంఘటన విషయాన్ని బాధితులను ఆడిగి తెలుసుకున్నారు. ఘన్‌శ్యామ్ కుటుంబ సభ్యులను నచ్చజెప్పారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేసి నిందితులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ విషయంపై ఉట్నూర్ డీఎస్పీ డేవిడ్ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని సీఐ వినోద్‌తోపాటు ఎస్సై గంగారామ్‌ను అడిగితెలుసుకోన్నారు. తమపైనే దాడికి పాల్పడ్డారని ఎస్సై పోలీసు అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. పూర్తి విచారణ చేసి పోలీస్‌లపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొంటామన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...