మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి


Sun,May 19, 2019 01:13 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యాన్ని అధికారులు పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో కృష్ణఆదిత్య అన్నారు. శనివారం కుమ్రంభీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో మూడు మండలాల ఎంపీడీవోలకు, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లోని 123 గ్రామ పంచాయతీల పరిధిలో 12 వేల 969 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయవలసి ఉందన్నారు. అధికారులు గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ లక్ష్యంపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు పూర్తి అయిన మరుగుదొడ్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ప్రారంభం కాని వాటిని త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచులు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణం చేయడంతో పాటు నాణ్యతల లోపాలు కనిపించరాదన్నారు. ప్రతి గ్రామపంచాయతీ సెక్రెటరీ తమ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యేలా బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో రాథోడ్ రాజేశ్వర్, ఐకేపీ ఏపీడీ శ్రీధర్‌స్వామి, ఎంపీడీవోలు ఫణీందర్‌రావు, రవీందర్, జిల్లా కోఆర్డినేటర్ రాజేశ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...