కన్నుల పండువగా కల్యాణోత్సవం


Sun,May 19, 2019 01:13 AM

బోథ్, నమస్తే తెలంగాణ : మండలంలోని కౌఠ (బీ) గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబ కల్యాణోత్సవం శనివారం కన్నుల పండువగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు కల్యాణోత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదట బ్యాండ్ మేళాలతో భక్తులు గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం, పైడు ముడుపు, ఎదుర్కోల కార్యక్రమం చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం జరిపించారు. వీరబ్రహ్మేంద్రస్వామి అనుమతితో గోవిందమాంబ మెడలో పండితుడు తాళి వేశారు. అనంతరం హోమం ఏర్పాటు చేశారు. ఐదుగురు దంపతులు హోమంలో పాల్గొన్నారు. గ్రామం పాడిపంటలతో చల్లగా ఉండాలని, గ్రామస్తులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ హోమం జరిపించారు. అనంతరం భక్తులు ఆలయంలో, ఉత్సవమూర్తులకు పూజలు చేశారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయించారు. భక్తులంతా సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కే రాధిక, ఉప సర్పంచ్ చిలకాడి రవి, కే గంగాధర్, డి గంగయ్య, వి సోమేశ్వర్, కుమ్మరి సంటెన్న, కొత్తకాపు మల్లయ్య, అవుసలి నడ్పి నర్సయ్య, వై వినాయక్‌రెడ్డి, సత్యనారాయణ, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...