స్త్రీ బాగుంటేనే ప్రపంచం అభివృద్ధి


Sun,May 19, 2019 01:13 AM

ఎదులాపురం : స్త్రీ బాగుంటేనే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని అమ్మభగవాన్ సూక్తులు చెబుతున్నాయని అనుపమ దాసాజీ అన్నారు. బుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ అమ్మభగవాన్ మానవ సేవ సమితి ఆధ్వర్యంలో స్త్రీ వరం కార్యక్రమాన్ని శనివారం పట్టణంలోని ఆర్‌ఎస్ గార్డెన్‌లో నిర్వహించారు. అమ్మభగవాన్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనుపమ దాసాజీ మాట్లాడుతూ.. కుటుంబానికి ఆధ్యాత్మిక మూల శక్తి స్త్రీ అని అమ్మభగవాన్ పేర్కొన్నారని తెలిపారు. అలాంటి స్త్రీ బాగున్నప్పుడే సమాజం బాగుంటుందన్నారు. పౌర్ణమి రోజు అమ్మభగవాన్ చంద్రునిలో దర్శనం ఇస్తున్నారని చెప్పారు. మహిళలు శరీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ ధ్యానం చేయాలన్నారు. అమ్మభగవాన్ సూక్తులను పాటిస్తూ జీవితాన్ని గడపాలని సూచించారు. కార్యక్రమంలో మానవసేవ సమితి సభ్యులు పుల్లయ్య, శంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...