మరింత మందికి ఆసరా


Sat,May 18, 2019 12:24 AM

ఆదిలాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు జిల్లా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆసరా పింఛన్ల వయోపరిమితిని 65 ఏళ్ల కాగా జిల్లా వ్యాప్తంగా 69,012 మంది లబ్ధిదారులకు ప్రతినెలా ప్రభుత్వం పింఛన్‌లను పంపిణీ చేస్తుంది. ఇక నుంచి 57 నుంచి 64 మధ్య వయస్సు ఉన్న వారికి సైతం పింఛన్ల పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్లు జాబితాను పరిశీలించిన అధికారులు జిల్లా వ్యాప్తంగా 29,865 మంది ఉన్నట్లు గుర్తించారు. మండలాల వారీగా వారి వివరాలను సేకరించారు. నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించారు. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి పరిశీలన జరిపిన అధికారులు, సిబ్బంది 10,531 మంది అర్హులను గుర్తించారు. ఉట్నూర్ మండలంలో 2205 మందిని గుర్తించగా వారిలో 912 మందిని అర్హులుగా తేల్చారు. తలమడుగు మండలంలో 1554 మందిని గుర్తించగా 596 మందిని, గుడిహత్నూర్‌లో 1230కి గాను 513 మందిని, భీంపూర్‌లో 1047 మందికి గాను 547, ఆదిలాబాద్ పట్టణంలో 6858 మందికి గాను 1271మందిని, తాంసి మండలంలో 814 మందికి గానూ 671మందిని, సిరికొండ మండలంలో 537 మందికి గాను 145 మందిని, నేరడిగొండ మండలంలో 1053 మందికి గాను 272 మందిని, నార్నూర్‌లో 910 మందికి గానూ 297 మందిని, మావలలో 600 మందికి గాను 134 మందిని, జైనథ్ మండలంలో 2898 మందికి గానూ 810 మందిని, ఇంద్రవెల్లి మండలంలో 1532 మందికి గాను 1297 మందిని, ఇచ్చోడ మండలంలో 1434 మందికి గాను 622 మందిని, గాదిగూడ మండలంలో 610 మందికి గాను 193 మందిని, బోథ్ మండలంలో 2096 మందికి గాను 837 మందిని, బేల మండలంలో 1706 గాను 480 మందిని, బజార్‌హత్నూర్ మండలంలో 1235కి గాను 504 మందికి, ఆదిలాబాద్ రూరల్ లో 1713 మందికి గానూ 429 మందిని అర్హులుగా గుర్తించారు. కొత్త పింఛన్ల కోసం ఎంపిక చేసిన వారి వివరాలను గ్రామసభల్లో ఉంచి వారు అర్హులా కాదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. గ్రామసభల్లో అర్హులుగా గుర్తించిన వారి జాబితాపై ఆమోదం పొందనున్నారు.
ఓటరు జాబితా ప్రకారం 57 సంవత్సరాలు నిండిన వారు ఆసరా పింఛన్లకు అర్హులుకాగా మెట్ట భూమి ఏడు ఎకరాలు, మాగాణి మూడు ఎకరాల్లోపు ఉండాలి. దరఖాస్తుదారుని వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలోపు ఉండాలి. లబ్ధిదారుల పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులై ఉండరాదు. రిటైర్డు ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్లు తీసుకునేవారు, ఐటీ రిటర్ను దాఖలు చేసేవారు అనర్హులు. 57 సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్న వారిని అన్ని నిబంధనలు పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు. నిబంధనల మేరకు చర్యలు తీసుకున్న అనంతరం అర్హుల జాబితాను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచుతారు. గ్రామసభల ఆమోదం అనంతరం గ్రామస్థాయిలో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ కమిషనర్లు అర్హుల జాబితాలోని లబ్ధిదారుని ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఫొటో సేకరించి కలెక్టర్ అనుమతి పొందుతారు. వీరికి త్వరలో పింఛన్లను పంపిణీ అవుతాయి.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...