ఓట్ల లెక్కింపులో తప్పులు దొర్లకుండా చూడాలి


Sat,May 18, 2019 12:21 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో ఎలాంటి తప్పులు దొర్లకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ నిర్వహించారు. ఈవీఎం, వీవీప్యాట్ల లెక్కింపులో తలెత్తే సాంకేతిక సమస్యలపై మాస్టర్ ట్రైనర్ గంగయ్య అవగాహన కల్పించారు. లెక్కింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కౌంటింగ్ నిర్వహించిన అనుభవం ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించారు. లెక్కింపు సమయంలో ఈవీఎంలు మొరాయిస్తే ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని వారికి తెలియజేయాలన్నారు. తమకు కేటాయించిన టేబుల్ వద్దకే సంబంధిత ఈవీఎంలు, వీవీప్యాట్లు అందిస్తామన్నారు. ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు కౌంటింగ్‌పై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ నెల 23న కౌంటింగ్ విధులకు సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సిబ్బంది ఉదయం 6 గంటలకే కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ సంధ్యారాణి, ఆర్డీవో సూర్యనారాయణ, కౌంటింగ్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...