నాసిరకం విత్తనాలపై నిఘా


Sat,May 18, 2019 12:20 AM

నిర్మల్ క్రైం : జిల్లాలో నాసిరకం విత్తనాల రవాణా, అమ్మకాలపై పోలీసు అధికారులు నిఘాను ఉంచాలని ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించినట్ల సమాచారం వస్తే కేసులు నమోదు చేయాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసులతో నెల వారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్‌రాజు మాట్లాడుతూ జిల్లా పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసం ముందుంటుందన్నారు. పోలీసులు ప్రజలకు జవాబు దారీగా ఉండాలని ప్రజా ఫిర్యాదులో జాప్యం లేకుండా తక్షణమే స్పంది ంచి సమస్యలను పరిష్కరించాలని పోలీసులకు సూచించారు. జిల్లాలో ప్రస్తుతం నేరాలు అదుపులో ఉన్నాయని ప్రజలకు పోలీసులపై విశ్వాసం పెరిగిందన్నారు. ఇందుకు కారణమైన పోలీసు అధికారులను అభినందించారు. పోలీసు స్టేషన్‌ల వారీగా విధి నిర్వహణలో పోటీపడి నేరాలను తగ్గుముఖం పట్టించేందుకు కృషి చేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు రివార్డులు ఉంటాయని అన్నారు. ఈ ప్రతిభ కనబర్చిన 18 మంది ఎస్సైలకు, ఏస్సైలు, హెచ్‌సీపీసీలకు ప్రశంసా పత్రాలను అందించారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌ల రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నేరాల నియంత్రణలో పాటు దర్యాప్తునకు దోహదం చేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేక చొరవతో కాలనీల్లో, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోనేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా పోలీసు అధికారులను అభినందించారు. ఈనెల 23, 27వ తేదీన జరుగబోయే ఓట్ల లెక్కింపు బందోబస్తు కూడా పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ దక్షిణ మూర్తి, డీఎస్పీలు ఉపేందర్‌రెడ్డి, రాజేశ్‌బల్లా, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్, సీఐలు జాన్‌దివాకర్, జీవన్‌రెడ్డి, అశోక్ కుమార్, శ్రీనివాస్, జిల్లాలోని ఎస్సైలు తదితరులున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...