అగ్ని మాపక శాఖకు కొత్త భవనాలు..!


Sat,May 18, 2019 12:20 AM

-చెన్నూర్, ఖానాపూర్ స్టేషన్లకు మంజూరు
-టెండర్లు పూర్తి.. త్వరలో పనులు ప్రారంభం
ఆదిలాబాద్ అర్బన్ / నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12 ఫైర్ స్టేషన్లు ఉన్నా యి. ఆదిలాబాద్, ఇచ్చోడ, భైంసా, నిర్మల్, ఉట్నూర్, జైనూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ స్టేషన్లతో పాటు కొత్తగా చెన్నూర్, బోథ్, ఖానాపూర్‌లలో ఏర్పాటు చేశారు. పాత ఫైర్‌స్టేషన్లకు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు ఉన్నాయి. అవి ఇపుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నారు. ఖానాపూర్, చెన్నూర్, బోథ్‌లలో ఫైర్‌స్టేషన్ లేక వాహనాలను బయటనే పార్కింగ్ చేస్తున్నారు. కనీసం సిబ్బందికి కూడా విశ్రాంతి తీసుకోడానికి సైతం వసతులు కొరవడుతున్నాయి. కొన్ని ఫైర్‌స్టేషన్లు అద్దె భవనాల్లో ఉన్నాయి. చెన్నూర్, ఖానాపూర్ ఫైర్‌స్టేషన్లకు రెండు భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. పోలీస్ హౌసింగ్ బోర్డు నుంచి అనుమతులు వచ్చాయి. టెండర్లు పూర్తి కాగా.. కోడ్ ముగియగానే పనులు ప్రారంభించనున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్ర ంలో దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం ఉంది. అరకొర వసతులతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక యూనిట్ ఫైర్‌స్టేషన్ ఉండగా.. కేవలం ఒక వాహనాన్ని మాత్రమే అందులో ఉంచడానికి స్థ లం ఉంది. మిగతా వాహనాలు కంపౌండ్ వాల్‌లోనే పార్కింగ్ చేస్తున్నారు. కనీసం డీఎఫ్‌వో, ఏడీఎఫ్‌వో సిబ్బందికి కూడా విశ్రాంతి తీసుకోడానికి వసతులు కొరవడ్డాయి. దీంతో నూతనంగా భవన నిర్మాణం కోసం అధికారులు రూ.కోటీ 40 లక్షలు అవసరం ఉందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నూతనంగా నిర్మించనున్న ఫైర్‌స్టేషన్ డబుల్ యూనిట్ భవనాన్ని నిర్మించనున్నారు. డీఎఫ్‌వో కార్యాలయంతో పాటు సిబ్బందికి సౌకర్యాలతో నిర్మించనున్నారు.

రెండు స్టేషన్లకు స్థలం సేకరణ..
గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జిల్లా విస్తీర్ణం పెద్దగా ఉండేది. ఫైర్‌స్టేషన్లు ఎక్కువగా ఉండడంతో మారుమూల ప్రాంతాల్లో ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే అక్కడి నుంచి అగ్నిమాపక వాహనం వెళ్లే సరికి కాలిబూడిదయ్యేది. అవసరాన్ని బట్టి అధికారులు అదనంగా ఖానాపూర్, చెన్నూర్, బోథ్‌లో నూతనంగా ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెన్నూర్, ఖానాపూర్ స్టేషన్లకు నూతన భవనాలు మంజూరు కాగా.. బోథ్ ఫైర్‌స్టేషన్‌కు 20 గుంటల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు సేకరించారు. ఉట్నూర్‌లో సైతం నూతన భవన నిర్మాణం కోసం 20 గుంటలను సేకరించారు. ఇక్కడ భవన నిర్మాణాలను చేపట్టేందుకు రూ.35 లక్షలు అవసరం ఉందని పోలీసు హౌజింగ్ బోర్డు అధికారులు ప్రతిపాదనలు పంపారు. త్వరలో అనుమతులు రాగానే భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం అగ్నిమాపక శాఖను పట్టించుకోక పోవడంతో అధికారులు, సిబ్బంది అరకొర వసతులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వరాష్ట్రంలో సర్కారు నూతన భవనాలను అధునాతన హంగులతో నిర్మించనుండగా.. అగ్నిమాపక శాఖ నూతన సొబగులతో రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 ఫైర్ వాహనాలు ఉండగా.. 12మంది డ్రైవర్లు ఉండగా.. ఆర్టీసీ డ్రైవర్లతో కొనసాగిస్తున్నారు. ఇలా ఫైర్‌మెన్‌లు, లీడింగ్ ఫైర్‌మెన్‌ల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఖాళీలన్ని భర్తీ కానున్నాయి.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...