పోలీస్ శాఖలో ఉద్యోగోన్నతుల జోరు


Sat,May 18, 2019 12:19 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : పోలీసు శాఖలో సిబ్బందికి ఉద్యోగోన్నతులు ఇవ్వనున్నారు. ఇటీవల హెడ్ కానిసేబుళ్లకు ఏఎస్సైలుగా.. ఏఎస్సైలకు ఎస్సైలుగా ఉద్యోగోన్నతులు లభించడంతో పోలీసుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 31 మంది ఏఎస్సైలకు ఈనెల 20వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు కేంద్రంలో మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ విష్ణువారియార్ తెలిపారు. శిక్షణ కాలంలో ప్రతిభ కనబర్చి, పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారికి ఎస్సైగా ఉద్యోగోన్నతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంపికైన 9 మంది ఏఎస్సైల జాబితాను విడుదల చేశారు. ఆదిలాబాద్ ఎస్బీ జి.అప్పారావు, టూటౌన్ ఖలీం, బేల నుంచి నజీబ్, బోథ్ నుంచి గంగారెడ్డి, టూటౌన్ కె.నర్సయ్య, ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్, తాంసి కానిస్టేబుల్ గంగాధర్, గుడిహత్నూర కానిస్టేబుల్ ఎం.స్వామి, ఇచ్చోడ కానిస్టేబుల్ నరసింహస్వామి ఈనెల 19న అంబర్‌పేట పోలీసు కేంద్రంలో శిక్షణ నిమిత్తం రిపోర్టు చేయాల్సిందిగా ఎస్పీ ఉత్తర్వూల్లో సూచించారు. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఎస్పీ విష్ణువారియర్‌లను జిల్లా పోలీసు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...