శిక్షణలతో నైపుణ్యం : ఐటీడీఏ పీవో


Sat,May 18, 2019 12:19 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా నైపుణ్యం మరింత పెరుగుతుందని ఐటీడీఏ పీవో కృష ్ణఆదిత్య అన్నారు. శుక్రవారం కొమురంభీం ప్రాం గణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ తరగతులను ప్రారం భించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సులువైన పద్దతిలో బోధించేందుకు ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలుగు, గణితం, ఆంగ్లం, పరిసరాల పరిజ్ఞానం లాంటి సబ్జెక్ట్‌లపై శిక్షణ అందిస్తున్నామన్నారు. దీని ద్వారా సులువైన బోధనతో పాటు విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు ఉపయోగపడుతుందన్నారు. గత విద్యాసంవత్సరంలో పది పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాదించామన్నారు. దానిని స్పూర్తిగా తీసుకొని పాఠశాలల ప్రారంభం నుండే ఉత్తమ ఫలితాలు సాదన దిశగా ముందుకు సాగాలన్నారు. అనారోగ్యంతో భాదపడుతున్న వారికి శిక్షణలో వెసులుబాటు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డీడీ చందన, ఏటీడీఓ చంద్రమోహన్, డీఆర్‌పీవోలు ఉదారాం, శ్రీనివాస్, మల్లయ్య, యశ్వంత్‌రావు, బలిరాం, రాజు, సురేశ్ పాల్గొన్నారు.

శిక్షణ తరగతులను జూన్‌కు మార్చాలని ఆందోళన
శిక్షణ తరగతులను జూన్ మాసానికి మార్చాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆత్రం భుజంగ్‌రావు, ముడుగు సామ్యూల్ ఆధ్వర్యంలో శిక్షణ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ ఎన్నికల విధులు ముగించుకొని రెండు రోజులకే శిక్షణ తరగతులు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్ర ఎండల కారణంగా జూన్‌లో తరగతులను నిర్వహించాలన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య సెంటర్‌కు చేరుకొని ఉపాధ్యాయులతో మాట్లాడారు. దానిని మార్చడానికి తమ పరిధిలో లేదని, సాఫీగా సాగడానికి సహకరించాలని సంఘాల నాయకులను కోరారు. శిక్షణల తర్వాత బడిబాట కార్యక్రమానికి ముందు నాలుగు రోజులు వెసులుబాటు ఇవ్వాలని కోరగా పీవో అంగీకరించడంతో వారు శిక్షణ తరగతులకు హాజరయ్యారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...