ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి


Fri,May 17, 2019 02:48 AM

నిర్మల్‌ టౌన్‌: నీటి సంరక్షణ పథకాలను ప్రోత్సహించేలా గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో భాగం గా నీటి గుంటలు, ఇంకుడు గుంతలు, చే పల చెరువులు, పాఠశాలలో వ్యక్తిగత మరుగు దొ డ్ల నిర్మాణం తదితర అంశాలపై గ్రామ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా హరితహారంలో గ్రామానికో నర్సరీలో పెద్ద ఎత్తున మొక్కలను పెంచినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తం గా 240 నర్సరీల్లో మొక్కలు పెంచినట్లు చెప్పా రు. మొక్కలు నాటడానికి కావల్సిన యాక్ష న్‌ ప్లాన్‌ను రూపొందించుకోవాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలందరికీ పని కల్పిస్తున్నామన్నారు. పనిచేసే ప్రదేశాల్లో కూలీలకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాబ్‌ కార్డు లేని వారు జాబ్‌ కార్డు పొందేలా కార్యదర్శులు చూ డాలన్నారు. సమావేశంలో అటవీశాఖ జిల్లా అధికారి ప్రసాద్‌, డీపీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...