ట్రాన్స్‌పోర్టు దుకాణాల తనిఖీ


Fri,May 17, 2019 02:47 AM

ఇచ్చోడ : రానున్న వానాకాలం సీజన్‌లో రైతన్నలకు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడితే కఠిన చర్యలు తప్పవని, వారి లైసెన్స్‌లను రద్దు చేస్తామని వ్యవసాయ అధికారి కైలాస్‌ హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు మండల కేంద్రమైన ఇచ్చోడలో గురువారం సాయంత్రం నవత, రాయల్‌ ట్రాన్స్‌పోర్టు దుకాణాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆమోదంలేని విత్తనాలను విక్రయించ రాదన్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు రైతులు, ఇతరుల దృష్టికి వస్తే వెంటనే వ్యవసాయ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలనీ ఆయన సూచించారు. పత్తి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులకు ఆ కంపెనీకి సంబంధించిన వివరాలతో కూడిన రషీదు పత్రాలను తప్పకుండా ఇవ్వాలనీ ఆయన పేర్కొన్నారు. ఇచ్చోడ సబ్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని ఫర్టిలైజర్స్‌, సీడ్స్‌ దుకాణాలను తనిఖీలు చేస్తున్నామని ఆయన వివరించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...