ఈతకు వెళ్లి బాలుడు మృతి


Fri,May 17, 2019 02:47 AM

కడెం : మండలకేంద్రంలోని జలాశయం వరదగేట్ల వద్దకు ఈ తకు వెళ్లి గురువారం రాజవరం రాజశేఖర్‌ అనే బాలుడు మృతిచెందాడు. కడెం ఎస్సై కృష్ణకుమార్‌ వివరాల ప్రకారం...కడెంకు చెందిన రాజవరం విజయలక్ష్మీ-సత్తయ్య దంపతుల ఏకైక కుమారుడు రాజశేఖర్‌ (14) మండలకేంద్రంలో జడ్పీ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేశాడు. గురువారం ఉదయం స్నానం కోసం కడెం ప్రాజెక్టు వరదగేట్ల వద్దకు వెళ్లి స్నానానికి దిగి నీళ్లలో మునిగిపోయాడు. 11 గంటల వరకు కొడుకు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు కొడుకు కోసం గాలిస్తు కడెం ప్రాజెక్టు మొదటి నంబర్‌ వరదగేటు వద్ద స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతిచెందిన విషయాన్ని స్థానికులు తెలుపడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లలతో బాలుడు మృతిదేహాన్ని బయటకు తీశారు. పంచానామా నిమిత్తం మృతదేహాన్ని ఖానాపూర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...