టెన్షన్‌.. టెన్షన్‌..


Thu,May 16, 2019 02:41 AM

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 70మండలాలు ఉండగా.. ఇందులో 66గ్రామీణ మండలాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1508గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 66జడ్పీటీసీ స్థానాలు, 567ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 6న తొలి విడత, 10న రెండో విడత నిర్వహించగా.. ఈ నెల 14న తుది విడత పోలింగ్‌ నిర్వహించారు. ఈ నెల 14న తుది విడత పోలింగ్‌ ముగియటంతో ప్రాదేశిక ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. పోలింగ్‌ ముగియగా.. ఇక ఫలితాల ప్రకటనే మిగిలింది. తొలి విడతలో భాగంగా ఈ నెల 6న ఉమ్మడి జిల్లాలో 26జడ్పీటీసీ స్థానాలు, 196ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. రెండో విడత కింద 20మండలాల్లోని 20జడ్పీటీసీ స్థానాలకు, 181ఎంపీటీసీ స్థానాలకు గాను.. 174ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నిర్మల్‌ జిల్లాలో నాలుగు, మంచిర్యాల జిల్లాలో మూడు.. మొత్తం ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడతలో భాగంగా ఈ నెల 14న ఉమ్మడి జిల్లాలో 20జడ్పీటీసీ స్థానాలతో పాటు 192ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

మూడు విడతల్లోనూ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో సగటున తొలి విడతలో 78.83శాతం, రెండో విడతలో 76.35శాతం పోలింగ్‌ నమోదుకాగా.. మూడో విడతలో 76శాతం పోలింగ్‌ నమోదయింది. మూడు విడతల్లోనూ 76శాతానికి పైగా పోలింగ్‌ నమోదుకాగా.. అన్ని జిల్లాల్లోనూ 74శాతానికి పైగా పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. తొలి విడత కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్‌ శాతం తగ్గగా.. తొలి, రెండో విడత కంటే మూడో విడతలో పోలింగ్‌ శాతం స్వల్పంగా తగ్గింది. తొలి విడత కంటే రెండో విడతలో 2.48శాతం తగ్గింది. రెండో విడత కంటే మూడో విడతలో 0.35శాతం తగ్గింది. తొలి విడత కంటే మూడో విడతలో 2.83శాతం పోలింగ్‌ తక్కువగా ఉంది. 76.35శాతంగా నమోదయింది. జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్‌లో తొలి విడతలో 82.13 శాతం, రెండో విడతలో 75.33శాతం, మూడో విడతలో 74.26శాతం నమోదయింది. నిర్మల్‌ జిల్లాలో తొలి విడతలో 76.30శాతం, రెండో విడతలో 76.67శాతం, మూడో విడతలో 78.53శాతంగా ఉంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తొలి విడతలో 80.82శాతం, రెండో విడతలో 76.14శాతం, మూడో విడతలో 75.65శాతం చొప్పున నమోదయింది. మంచిర్యాల జిల్లాలో తొలి విడతలో 75.95శాతం, రెండో విడతలో 77.26శాతం, మూడో విడతలో 75.58శాతం చొప్పున పోలింగ్‌ జరిగింది.

మూడో విడతలోనూ నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలో మహిళలు అధికంగా పోలింగ్‌లో పాల్గొనగా.. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పురుషులు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. మూడో విడతలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 4,87,844మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 3,70,936మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ లెక్కన 76శాతం పోలింగ్‌ నమోదయింది. ఉమ్మడి జిల్లాలోని ఓటర్లలో మొత్తం 2,40,814మంది పురుష ఓటర్లు ఉండగా.. 1,83,582మంది పురుష ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. దీంతో 76.23శాతం మంది పురుష ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలో 2,47,005మంది మహిళా ఓటర్లు ఉండగా.. 1,87,352మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో మహిళల 75.85శాతం పోలింగ్‌ నమోదయింది. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగం చేసుకోగా.. పోలింగ్‌ శాతంలో మాత్రం పురుషులదే ఎక్కువగా నమోదయింది. ఇతరుల విషయానికొస్తే 25 మంది ఓటర్లుండగా... ఇందులో ఇద్దరు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ ప్రక్రియ ముగియటంతో.. ఇక ఫలితాలు ప్రకటనే మిగిలింది. ఇప్పటికే అభ్యర్థుల గ్రామాలు, కుటుంబాలు, వార్డులు, సామాజిక వర్గాల వారీగా ఓట్ల లెక్కలో మునిగి తేలుతున్నారు. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండగా.. మరో 11రోజుల పాటు వేచి చూడాలి. ఈ నెల 27న అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుండగా.. అప్పటి వరకు తీవ్ర ఉత్కంఠ తప్పేలా లేదు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...