ఓట్ల లెక్కింపునకుఏర్పాట్లు చేయండి


Thu,May 16, 2019 02:40 AM

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ నియోజకవర్గ పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపునకు ఈనెల 20లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్‌ అధికారి, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. బుధవా రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని సహాయ రిటర్నింగ్‌ అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 23న జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసన సభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పోలింగ్‌ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాలలో ఓట్ల లెక్కింపుకు కావాల్సిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

సాంకేతిక నిపుణులతో పరిశీలించాలని, ఓట్ల లెక్కింపు సమయంలో సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించాలని అన్నారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బందిని నియమించుకొని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రతి రౌండ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు వివరాలను సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. అందుకు గాను ఈనెల 21న టెస్టింగ్‌ను నిర్వహించుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవసరమైన సీసీ టీవీ కెమెరాలను, ఏసీలను, టేబుళ్లు, సదుపాయాలు వంటివి ఏర్పాట్లను చేసుకోవాలని అన్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు వివరాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. సాయంత్రం ఓట్ల లెక్కింపు కేంద్రాలను మీడియా సెంటర్‌లను కలెక్టర్‌, ఆర్డీవోలు, తహసీల్దార్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, జాయింట్‌ కలెక్టర్‌ జి.సంధ్యారాణి, ఆర్‌డీవోలు, తహసీల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన..
ఈనెల 23న పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా.. బుధవారం కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ కౌంటింగ్‌ కేంద్రాలతో పాటు స్ట్రాంగ్‌రూంలను పరిశీలించారు. భద్రత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేనిదే ఇతర వ్యక్తులను అనుమతించరాదని భద్రత సిబ్బందికి ఆదేశించారు. కలెక్టర్‌ వెంట నాలుగు జిల్లాల అధికారులు, ఐటీడీఏ పీవో, జిల్లా సంయుక్త కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్లు ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...