ఉపాధ్యాయ నైపుణ్యతను పెంపొందించేందుకు కృషి


Thu,May 16, 2019 02:40 AM

ఉట్నూర్‌, నమస్తే తెలంగాణ: శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయుల నైపుణ్యతను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు ఐటీడీఏ పీవో కృష్ణాఆదిత్య తెలిపారు. బుధవారం ఐటీడీఏ పీవో క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఎస్సెస్సీ ఫలితాలు తక్కువగా ఉన్నాయన్నారు. వీటి ఫలితాలు సీఆర్టీ ఉపాధ్యాయులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాలు పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల డ్రాపౌట్‌ లు కాకుండా చర్యలు తీసుకోవల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, వార్డెన్‌లపై ఉందన్నారు. మోడల్‌ స్కూల్‌లను ఆదర్శంగా తీసుకొని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలో ఫలితాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఐటీడీఏ పరిధిలోని 40వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో శిక్షణ కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఉపాధ్యాయుల సమస్యలను పీవో పరిదిలో ఉన్నవి పరిష్కరించడంతో పాటు ఉన్నతాధికారులకు విన్నవిస్తామన్నారు. ఉపాధ్యాయులు జిల్లాలో ఉత్సాహాంగా పనిచేస్తున్నారని మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న శిక్షణ కేంద్రాలకు హాజరు అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల చివరి వారంలో బడిబాట కార్యక్రమం మొదలవుతుందని డ్రాపౌట్‌ విద్యార్థులందరిని పాఠశాలలో చేర్చించే విధంగా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ చందన సర్పే, పీఎంఆర్‌సీ ఏసీఎంవో జగన్‌, ఓఎస్‌డీ రాజ్‌కుమార్‌, పీజీహెచ్‌ఎంలు చంద్‌, ప్రేమ్‌దాస్‌, ప్రకాష్‌, వెంకట్‌, శ్యామల, భుజంగ్‌రావు, మడావి లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు.

మానిటరింగ్‌ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి
ఏజెన్సీలో విద్యా వ్యవస్థ పటిష్ట పడేందుకు సీనియర్‌ పీజీహెచ్‌ఎంలను మానిటరింగ్‌ కోసం నియమించాలని టీఎస్‌టీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు కపిల్‌ జాదవ్‌ బుధవారం ఐటీడీఏ పీవోకు క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..లంబాడా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ, లంబాడ తెగలలో ఘర్షణ వలన విద్యార్థులకు తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. ఈ వివాదంలో ఉపాధ్యాయులు సైతం మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. దీనిని ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్‌ పట్టించుకోవాలన్నారు. ఐటీడీఏ అధికారులు సీఆర్టీలపై లక్ష్యం చేయడం సరికాదన్నారు. జూన్‌ మాసంలో పాఠశాల ప్రారంభంతోనే సీఆర్టీలను రిన్‌వల్‌ చేయాలన్నారు. విద్యావ్యవస్థలో ప్రక్షాలన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాదవ్‌ చంద్రకాంత్‌ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...