వైద్య సిబ్బందిపై పీవో కొరఢా


Thu,May 16, 2019 02:39 AM

- 10 మందికి షోకాజ్‌ నోటీసులు
ఉట్నూర్‌, నమస్తే తెలంగాణ : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై ఐటీడీఏ పీవో కృష్ణాదిత్య కొరడా ఝళిపించారు. షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం శ్యాంపూర్‌, పిట్టబొంగరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు సందర్శించిన పీవో సమయంలో ఎవరూ లేకపోవడంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక పీవో క్యాంపు కార్యాలయంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి తొడసం చందుతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పీవో మాట్లాడుతూ తాను శ్యాంపూర్‌ ప్రాథమిక కేంద్రాన్ని మధ్యాహ్నం సందర్శించేందుకు వెళ్లగా తాళం వేసి ఉందన్నారు. పిట్టబొంగరంలో సరైన విధి నిర్వహణ లేకపోవడంతో శ్యాంపూర్‌ వైద్యుడు క్రాంతికుమార్‌, ఫార్మసిస్ట్‌ శ్రీనివాస్‌, వరలక్ష్మి, విజయకుమార్‌, ఎల్‌టీ ఉద్దల్‌, ఏఎన్‌ఎం లలిత, పిట్టబొంగరం వైద్యుడు శ్రీధర్‌, ఎల్‌టీ సూర్యకళ, జాదవ్‌ ప్రవీణ్‌, హెచ్‌ఈవో అశోక్‌ మొత్తం 10 మందికి షోకాజ్‌ నోటీసులు అందజేయాలని ఆదేశించారు. వీరంతా ఒక రోజులోనే సమాదానాలు తనకు అందజేయాలని ఆదేశించారు. వీటితో పాటు మూడు నెలల అటెండెన్స్‌ రిజిష్టర్‌ జిరాక్స్‌ కాపీలను, మూమెంట్‌ రిజిష్టర్‌ జిరాక్స్‌, మినిట్స్‌ సమావేశాల నివేదికలను అందజేయాలని సూచించారు. సిబ్బంది సీఎల్‌లు వాడుకునే ముందు ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. దవాఖానల్లో మంచినీటి, మరుగుదొడ్లతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి తొడసం చందు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో వసంత్‌రావు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...