హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలి


Thu,May 16, 2019 02:39 AM

తానూర్‌/ముథోల్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటేందుకు మొక్కలను సిద్ధం చేయాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లు నర్సరీల నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం తానూర్‌ మండలంలోని హిప్నెల్లి, ఝరి, బోంద్రట్‌, బెల్‌తరోడ, ఎల్వీ గ్రామాల్లోని నర్సరీలను పరిశీలించిన ఆయన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో ఈజీఎస్‌ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మొక్కకు సంబంధించి లెక్క పక్కాగా ఉండాలని, కూలీలకు చేతినిండా పని కల్పించే బాధ్యత సిబ్బందిపైనే ఉందన్నారు. మండల స్థాయిలో ఎనిమిది వేల మంది కూలీలకు పని కల్పించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేస్తున్న బెల్‌తరోడ ఎఫ్‌ఏ బాబుష్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు డీఆర్‌డీవో తెలిపారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.

కూలీల సంఖ్యను పెంచాలి
ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ముథోల్‌లోని ఈజీఎస్‌ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉపాధి పనులపై క్షుణ్ణంగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. హరితహారం నర్సరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు అందించాలన్నారు. సమావేశంలో ఏపీవో శిరీష, ఈసీ సోనేరావు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...