ప్లాస్టిక్‌ వినియోగాన్ని మానుకోవాలి


Thu,May 16, 2019 02:36 AM

ఖానాపూర్‌ : ఖానాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల్లో ప్లాస్టిక్‌ ఉపయోగాన్ని మానుకోవాలని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. బుధవారం స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా అధికారులు, సిబ్బంది కలిసి పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. వినియోగదారులకు సరుకులను ప్యాక్‌ చేసి ఇస్తున్న ప్లాస్టిక్‌ కవర్లను వారు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఖానాపూర్‌ మున్సిపాలిటీ జూనియర్‌ అసిస్టెంట్‌ రాజేందర్‌ అన్నారు. ప్లాస్టిక్‌ బారిన పడి జంతువులు కూడా చనిపోతున్నాయన్నారు. ప్రజలు కూడా సరుకులు కొనడానికి దుకాణాలకు వచ్చే సమయంలో ఇంటి నుంచి సంచులు వెంట తీసుకొని రావాలని కోరారు. వ్యాపారులు కూడా పేపర్లతో తయారు చేసిన బ్యాగులను మాత్రమే వాడాలని సూచించారు. మున్సిపల్‌ శాఖ నిబంధనలు కాదని ప్లాస్టిక్‌ సంచులను వాడితే సదరు వ్యాపారులకు జరిమానాలు విధించడం జరుగుతుందని, మారకపోతే కేసులు కూడా నమోదు చేసి వ్యాపారాలకు సంబంధించిన లైసెన్సులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. హోటల్‌ యజమానులు కూడా ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని రాజేందర్‌ సూచించారు. దాడుల్లో ఆయనతో పాటుగా మున్సిపాలిటీ సిబ్బంది భోజరాం, మానాల శంకర్‌, వీరగోని రమేశ్‌గౌడ్‌, అరుణ్‌, భూమన్న తదితరులు ఉన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...