వడ దెబ్బతో ఇద్దరు యువకుల మృతి


Wed,May 15, 2019 02:50 AM

జైనథ్‌: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు పిట్టల్లా రాలి పోతున్నారు.తాజాగా జైనథ్‌, ఇంద్రవెల్లి, మండలాల్లో ఇద్దరు యువకులు వడదెబ్బ కారణంగా మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకరు పళ్లైన వారం రోజుల్లోనే వడదెబ్బకు మృతిచెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. జైనథ్‌ మండలంలోని కూర గ్రామానికి చెందిన గట్ల సాయిప్రసాద్‌ (25) వడదెబ్బతో మృతి చెందినట్లు ఏఎస్సై దైవశాల తెలిపారు. గట్ల సాయిప్రసాద్‌కు ఈనెల 8న పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన రజితతో వివాహం జరిగింది. సోమవారం ఇంట్లో పూజ కార్యక్రమాల కోసం బంధువులకు విందును ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి భోజనం వడ్డించే క్రమంలో 10గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11గంటలకు మృతి చెందినట్లు తెలిపారు. పెండ్లి పత్రికలు పంచే క్రమంలో ఎండలో తిరగడంతో ఎండ దెబ్బతగలడంతో మృతి చెందినట్లు తెలిపారు. పెళ్లి జరిగి వారం రోజులు కాక ముందే పెండ్లి కొడుకు మృత్యువాత పడడంతో అటు పిప్పల్‌కోఠిలో, ఇటు కూర గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...