వేర్వేరు ప్రమాదాల్లో ఇండ్లు, పశువుల పాకలు దగ్ధం


Wed,May 15, 2019 02:49 AM

బోథ్‌, నమస్తే తెలంగాణ: మండలంలోని కౌఠ (బీ) గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. రూ 5 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. రెండు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రాత్రి పదకొండున్నర ప్రాంతంలో తోట శివ్వారెడ్డి అనే రైతుకు చెందిన పశువుల పాకకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. వేసవి కావడంతో ఒక్కసారిగా పూర్తిగా వ్యాపించాయి. పక్కనున్న గడ్డల భూషణ్‌, చెక్క లక్ష్మణ్‌ పాకలకు వ్యాపించాయి. గమనించిన కాలనీ వాసులు కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ప్రమాదంలో రెండు ఎడ్ల బండ్లు మల్లెపూల గంగాధర్‌, తోట శివ్వారెడ్డిలకు చెందినవి పూర్తిగా కాలిపోయాయి. శివ్వారెడ్డికి చెందిన రెండు గేదెలకు మంటలు అంటుకున్నాయి. అవి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. నాలుగు బండ్ల జొన్న చొప్ప అగ్నికి ఆహూతయ్యింది. అరక సామగ్రి, కలప పూర్తిగా కాలిపోయింది. పాకలకు చుట్టూ ఉన్న తడకలు, రేకులు కాలిపోయాయి. వీటి పక్కనున్న సైఫొద్దీన్‌ అనే వ్యక్తికి చెందిన మోటరు, తీగలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఇచ్చోడ అగ్నిమాపక శకటం అక్కడకి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పి వేసింది.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...