వైద్యులు అందుబాటులో ఉండాలి


Wed,May 15, 2019 02:48 AM

ఇంద్రవెల్లి : దవాఖానలో విధులు నిర్వహించే వైద్యాధికారులతోపాటు వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఐటీడీఏ పీవో కృష్ణఆదిత్య అన్నారు. మంగళవారం మండలంలోని పిట్టబోంగురం దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వివరాల నమోదు రికార్డులు, ఓపీ నమోదు రికార్డులు, మందుల స్టోర్‌ రూంను పరిశీలించారు. గర్భిణులతోపాటు బాలింతల పూర్తి వివరాల నమోదు సక్రమంగా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారులతోపాటు వైద్యసిబ్బంది పనితీరులో మార్పులు రావాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దవాఖానకు సంబంధించిన ప్రతి రికార్డును సక్రమంగా నమోదు చేయాలన్నారు. వైద్యం కోసం దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. గర్భిణులతోపాటు బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంత్‌రావ్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...