చెక్‌పోస్టు వద్ద నిఘా పెంపు


Mon,May 13, 2019 03:14 AM

ఖానాపూర్ : నిర్మల్-జగిత్యాల జిల్లాల సరిహద్దులో గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి కూడా తగిన భద్రత, కనీస వసతులు ఉండేవి కావు. ప్రస్తుతం ప్రభుత్వం అటవీ సంరక్షణకు కఠినమైన చర్యలు చేపట్టడడంతో అన్ని చెక్ పోస్టులో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. కొందరు ఫారెస్ట్ అధికారులు చెక్‌పోస్టుల వద్ద అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా రావడంతో ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు అవకాశం కల్పించాయి. కలప స్మగ్లింగ్ చేసే వాహనాలను గుర్తింపునకు, సిబ్బంది భద్రత కోసం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహించే వారి సౌకర్యం కోసం కూడా అటవీ శాఖ దృష్టి సారించింది. వాహనాలను ఆపేందుకు శిథిలమైన గేట్‌ను ఇటీవల మార్చారు. దాని స్థానంలో కొత్తగా పటిష్టమైన గేట్‌ను ఏర్పాటు చేశారు. సిబ్బంది విధులు నిర్వహించే షెల్టర్ చుట్టూ వెదురు బొంగులతో అలంకరించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగుల కోసం చెక్‌పోస్టు పక్కనే మరుగుదొడ్డిని కూడా నిర్మిస్తున్నారు. ఇకపై సీసీ కెమెరా నిఘాలో పనిచేస్తున్న బాదనకుర్తి చెక్‌పోస్టు నుంచి సిబ్బంది చేతి వాటం ఉంటే తప్ప దొంగచాటుగా అక్రమ కలప వాహనాలు దాటిపోయే ఆవకాశం లేదని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా చెక్‌పోస్టు చెంత విధులు నిర్వహించే సిబ్బందిపై కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.

వారి అవినీతికి పాల్పడి కలప వాహనాలు దాటిస్తే యుద్ధ ప్రాతిపదిన సదరు సిబ్బందిపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకునే ఏర్పాట్లను చేశారు. గతంలోని బాదనకుర్తి చెక్‌పోస్టుకు, ఇప్పటి ఆధునిక చెక్‌పోస్టుకు ఎంతో తేడా ఉంది. అక్రమ కలప తరలింపు నివారణలో ఇదొక భాగమని అధికారులు అంటున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...