వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టండి


Mon,May 13, 2019 03:13 AM

ఖానాపూర్: వేసవి సీజన్‌లో తాగునీటి కోసం అడవిలోని జంతువులు చాలా ఇబ్బందులు పడతాయని, వాటి మనుగడలో సమస్య ఎదురుకాకుండా చూడాలని నిర్మల్ జిల్లా అటవీ ముఖ్య సంరక్షణాధికారి సీపీ వినోద్‌కుమార్ సూచించారు. ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని జంతువులు సంచరించే ప్రదేశాలను ఆదివారం పరిశీలించారు. ఎండను సైతం లెక్కచేయకుండా కాలినడకన అడవిలో కిలో మీటర్ల మేర నడిచి వన్యప్రాణుల పరిస్థితులను అవగతం చేసుకున్నారు. కొన్ని చోట్ల జంతువుల కోసం అటవీ శాఖ తాగునీటి వసతులు ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిపోవడం లేదని సిబ్బందికి సూచించారు. మరిన్ని చోట్ల తాగునీటి కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. విపరీతమైన ఎండల కారణంగా అడవిలోని నీటి కుంటలన్నీ పోయాయని, వాటి స్థానంలో విధిగా నీట సౌకర్యం కల్పించాలన్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లోకి సాధారణ వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరో నెల రోజుల పాటు ఎండలు ఇలాగే ఉంటాయని, జంతువులకు నీరు లేకపోతే నీటి జాడలను వెతుక్కుంటూ రోడ్లపైకి వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని అన్ని ఫారెస్ట్ రేంజుల్లో పనిచేసే అధికారులు గమనించాలన్నారు. జంతువులు చనిపోతే సంబంధిత సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట నిర్మల్ ఎఫ్‌డీవో గోపాల్‌రావు, ఖానాపూర్ రేంజర్ గుగ్లోత్ వినాయక్, డిప్యూటీ రేంజర్ గడ్‌చాంద రత్నాకర్‌రావు, ఎఫ్‌ఎస్‌వో శ్రీలత, ఎఫ్‌బీవో లాలాజీ, బయాలజిస్ట్ ఎల్లం తదితరులు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...