అటవీ జంతువులను సంరక్షించుకోవాలి


Mon,May 13, 2019 03:12 AM

ఉట్నూర్ రూరల్: అటవీ జంతువులను సంరక్షించుకోవాలని హైదరాబాద్‌కు చెందిన స్నేక్ ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రథినిధి మైఖేల్, జాన్ సూచించారు. మండలంలోని బిర్సాయిపేట్ రేంజ్ పరిధిలోని అడవిలో ఆదివారం బేస్ క్యాంప్ వద్ద బస చేసి అడవిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎఫ్‌డీవో చంద్రకాంత్‌తో కలిసి జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి సౌకర్యాన్ని పరిశీలించారు. నీటి మడుగుల వద్ద జంతువుల అడుగులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడవిలోని జంతువుల, పక్షులు, చెట్లు, అటవీ సంపద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గణాంక వివరాలను అధికారు వద్ద నుంచి తీసుకున్నారు. అటవీ సంపదను కాపాడుకున్నప్పుడే మానవ మనుగడ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో గులామ్ మొయినొద్దీన్, ఎఫ్‌ఎస్‌వో రాము తదితరులు పాల్గొన్నారు.

గిరిజన గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఉట్నూర్, నమస్తే తెలంగాణ: గిరిజన గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌సీవో లక్ష్మయ్య ఆదివారం ఒక ప్రకటన ద్వారా సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియం 6 నుంచి 9వ తరగతి వరకు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని, అర్హత పరీక్ష ఈ నెల 30న ఉంటుందని తెలిపారు. కెరమెరి మండలంలోని పీవీటీజీ (ప్రస్తుతం ఆసిఫాబాద్‌లో ఉంది) గురుకులంలో 3 తరగతిలో 80 సీట్లు, 4లో 35 సీట్లు, 5లో 23 సీట్లు, 6లో 40 సీట్లు, 8లో 26 సీట్లు, 9లో 30 సీట్లు మొత్తం 230 ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిభా గురుకులాల్లో 8 తరగతి ప్రవేశం కోసం ఖమ్మంలో బాయ్స్‌కు 60 సీట్లు, వికారాబాద్ జిల్లా పరిగిలో బాలికలకు 30 సీట్లు ఉన్నాయని, వీటికి ఆన్‌లైన్ ద్వారా ఈనెల 23లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హత పరీక్ష 30న ఉంటుందని తెలిపారు. ఉట్నూర్, ఆసిఫాబాద్, బోథ్ (ప్రస్తుతం ఆదిలాబాద్‌లో) డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 8న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...