మండపం అక్షరాభ్యాసానికా ..? వాహనాలకా..?


Mon,May 13, 2019 03:12 AM

బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో పూజారులు, కొందరు సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే అమ్మవారి కిరీటంలో ఆకుపచ్చ రత్నం మిస్సింగ్ విషయంలో ఇద్దరికి మెమోలు జారీ అయిన విషయం తెలిసిందే. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల స్పందించి శనివారం ఆలయాన్ని సందర్శించారు. కిరీటంలో రత్నం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. అయినా సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. వంద రూపాయల అక్షరభ్యాస మండపంలో విధులు నిర్వహించే పూజారులు, సిబ్బంది తమ వాహనాలను మండప ముఖ ద్వారం వద్ద పార్క్ చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండకు తట్టుకోలేక భక్తులు ఇబ్బంది పడుతున్నప్పటికీ వాహనాలను మండపాల వద్ద నిలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...