ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి


Sun,May 12, 2019 02:08 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : మెడికల్, హెల్త్ రంగాల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిన పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మెడికల్, హెల్త్ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఆధ్వర్యంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిని, మంత్రి ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్, హెల్త్ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 20 సంత్సరాలుగా పనిచేస్తున్నా వేతనం పెరగడం లేదని వాపోయారు. వేతనాలు సైతం సరిగా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెం12, 14 ప్రకారం వేతనాలు పెంచాలని, ప్రతి నెలా వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఉద్యోగి కార్మికులకు ఈఎస్‌ఐ, ఫీఎఫ్ వర్తింపజేయాలని వారు కోరారు. యూనిఫాం అలవెన్స్‌లు ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతితో కూడిన వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, అసోసియేట్ అధ్యక్షుడు సుభాష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...