సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలి


Sun,May 12, 2019 02:08 AM

తలమడుగు : రైతు సమగ్ర సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ నోడల్ అధికారి శివకుమార్ అన్నారు. శనివారం మండలంలోని ఝరి గ్రామ పంచాయతీ పరిధిలోని పూనగూడ గ్రామంలో కొనసాగుతున్న రైతు సమగ్ర సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పూర్తి వివరాలను వ్యవసాయ శాఖ ఏఈవోల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం రత్నాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో మట్టి నమూనాలను సేకరించారు. జాతీయ సుస్థిర వ్యవసాయ శాఖ పథకంలో భాగంగా గ్రామ పరిధిలోని 102 మంది రైతులు వ్యవసాయ భూముల మట్టి నమూనా సేకరించి ఈ నెల 30లోగా రైతులకు అందిస్తామని అధికారులు వెల్లడించారు. చర్లపల్లి గ్రామానికి చెందిన రైతు ఆత్రంభీంరావ్ ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబానికి రైతు బీమాకు సంబంధించిన 5లక్షల రూపాయల చెక్‌ను బ్యాంక్‌లో జమచేసి సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్, రమేశ్, రైతులు తదితరులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...