ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి


Mon,April 22, 2019 11:19 PM

నిర్మల్ టౌన్: జిల్లాలో యాసంగిలో రైతులు సాగు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టాలని జేసీ ఎ.భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం జేసీ తన చాంబర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం రైతుల చేతికి వస్తున్న నేపథ్యంలో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డీఆర్‌డీఏ, డీసీఎంఎస్, గిరిజన మార్క్‌ఫెడ్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో 125 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే ఆరు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. యాసంగిలో అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్నందున ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతిరోజు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని ఆదేశించారు.

రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఏ రోజుకారోజు ట్యాబ్‌లో నమోదు చేయాలని సూచించారు. ట్యాబ్‌లో సకాలంలో నమోదు చేస్తేనే రైతులకు వరి ధాన్యం డబ్బులు సకాలంలో జమవుతాయని పేర్కొన్నారు. ఆయా కేంద్రాలను తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించాలని, తేమశాతం చూసుకొని రైతులు కొనుగోలు కేంద్రాలను తీసుకవచ్చేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి సూర్య చంద్రరావు, డీఎస్‌వో కిరణ్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారి కోటేశ్వర్‌రావు, డీసీఎంసీ మేనేజర్ భోజన్న, డీటీ రహీం, కవిత, అధికారులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...