ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి


Mon,April 22, 2019 11:19 PM

నిర్మల్ టౌన్: జిల్లాలో ఈ నెల 24 నుంచి వచ్చే నెల 9 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో పదోతరగతి పరీక్షల కోసం నాలుగు కేంద్రాలనుఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్, మంజులాపూర్, జడ్పీహెచ్‌ఎస్ సోమార్‌పేట్, బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పదోతరగతి పరీక్షలను నిర్వహిస్తారని తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో 330 మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మంజులాపూర్‌లో 230 మంది, సోమార్‌పేట్ ఉన్నత పాఠశాలలో 263 మంది, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 240 మంది, జుమ్మెరాత్‌పేట్ ఉన్నత పాఠశాలలో 160 మంది పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...