ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి


Mon,April 22, 2019 11:19 PM

ఖానాపూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు జేసీ భాస్కర్‌రావు సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు రైతులకు సంపూర్ణ సహకారం అందించాలని ఆదేశించారు. సోమవారం ఆయన మండలంలోని సత్తెనపెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. గ్రామంలోని గిరిజన ప్రాథమిక సహకార మార్కెట్ సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు. ఏ- గ్రేడు ధాన్యానికి రూ. 1770, బీ- గ్రేడు ధాన్యానికి రూ. 1750 చెల్లించనున్నట్లు తెలిపారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎం శ్రీకళ, తహసీల్దార్ నడిమెట్ల సత్యనారాయణ, జీసీసీ జీఎం తారాచంద్, డీటీలు కవితా రెడ్డి, కలీం, జీసీసీ సేల్స్‌మెన్‌లు కిషన్‌నాయక్, ప్రభాకర్, గ్రామ సర్పంచి సీర్ల లక్ష్మి, రైతులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...