స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Mon,April 22, 2019 11:19 PM

ముథోల్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ముథోల్‌లోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల కౌటింగ్ కేంద్రం, స్ట్రాంగ్‌రూంను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. గురుకులంలోని 21 గదులను ఎస్పీ శశిధర్‌రాజు, డీపీవో శ్రీనివాస్, ఎంపీడీవోలతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు. ఇది వరకే మొదటి, రెండో విడతల్లో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ముథోల్ నియోజకవర్గంలోని కుంటాల, లోకేశ్వరం మండలాల్లో రెండో విడతలో ఎన్నికలు జరుగుతాయని, ముథోల్, భైంసా, కుభీర్, తానూర్, బాసర మండలాల్లో మూడవ విడతలో ఎన్నికలు జరుగుతాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లను ముథోల్‌లోని గురుకుల పాఠశాలలో లెక్కించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించామని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమావేశంలో ఎంపీడీవోలు నూర్‌మహ్మద్, శేఖర్, దేవేందర్, గంగాధర్, ఈవోపీఆర్డీ నాగ్‌నాథ్, తిరుపతిరెడ్డి, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినులకు అభినందన
నిర్మల్ టౌన్: ప్రభు త్వ కళాశాలల్లో చదివి ఇంటర్ మీడియట్ ఫలితాల్లో మంచి మార్కు లు సాధించిన ముగ్గురు విద్యార్థినులను కలెక్టర్ ప్రశాంతి సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాం పు కార్యాలయంలో సన్మానించారు. సోఫినగర్, సారంగాపూర్ మండలం జాం గురుకులాల్లో విద్యనభ్యసించిన మార అశ్విత 459, ప్రసన్న 456 (ఎంపీసీ), వి.నిఖిత 426 (బైపీసీ) మార్కులు సాధించడంతో వారిని కలెక్టర్ అభినందించి స్వీట్లు తినిపించారు. మరింత కష్టపడి ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంగాశంకర్, ఉపాధ్యాయులు వెంకట్, దేవేందర్, పోషకులు సాయన్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...