బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు మాయం


Mon,April 22, 2019 02:27 AM

-ఏటీఎం నంబర్ తెలుసుకొని రూ.40 వేలు డ్రా
-న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు
కడెం : మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన ముత్యంపేట రాజేశ్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలో నుంచి రూ. 40 వేలు మాయమయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్ర కారం.. ఖానాపూర్ మండలం లోని బీర్నంది గ్రామానికి చెందిన రాజేశ్ బావమరిది నవీన్ ఉద్యోగం కోసం ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి రూ. 15 వేలు పంపిం చాడు. ఉద్యోగం ఇప్పించడం వి షయంలో సదరు వ్యక్తి జాప్యం చేపడంతో ఫోన్లో ఢిల్లీకి చెందిన వ్యక్తిని తన బావమరిది నవీన్ బెదిరించాడని అన్నారు. దీంతో సదురు వ్యక్తి బ్యాంకు ఖాతా నంబర్ చెబితే అందులో డబ్బులు జమ చేస్తానని అనడంతో నవీన్ బ్యాంక్ అకౌంట్ పని చేయని కారణంగా బావనైన అకౌంట్ నంబర్‌ను ఢిల్లీకి చెందిన వ్యక్తికి ఇచ్చాడు. అయినప్పటికీ డబ్బులు వేయకపోవడంతో తిరిగి కాల్ చేస్తే ఏటీఎం నంబర్ పంపిస్తే కార్డ్ నుంచి కార్డ్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పాడు. దీంతో ఏటీఎం కార్డ్ నంబర్ అందజేశారు. మరుసటి రోజు చూస్తే తన ఖాతాలో నుంచి రూ. 40 వేలు మాయమయ్యాయని బాధితుడు తెలిపారు. తనకు న్యాయం చేసి, సదురు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు రాజేశ్ కోరుతున్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...