కానిస్టేబుల్ మెయిన్స్ కోసం త్వరలో నమూనా పరీక్ష


Mon,April 22, 2019 02:27 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : విద్యార్థులు సాయివైకుంఠ ట్రస్ట్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ట్రస్ట్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ రవికిరణ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఈ ఉద్యోగాల కోసం యువతకు ట్రస్ట్ ద్వారా అనుభజ్ఞులైన అధ్యాపకులతో మంచి బోధన అందించామని చెప్పారు. తమ ట్రస్ట్‌లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. త్వరలో నిర్వహించే కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు సిద్ధం కావడం కోసం సాయివైకుంఠ ట్రస్ట్ ద్వారా నమూనా పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బడుగు బలహీన వర్గాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి వృత్తి నైపుణ్యతలో శిక్షణను ట్రస్ట్ ద్వారా ఇప్పిస్తామన్నారు. ఉమ్మడి గురుకులాల ప్రవేశ పరీక్షలకు స్వేరోస్, సాయివైకుంఠ ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణను అందించి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామన్నారు. విద్య, వైద్యం, ఇతర సామాజిక సేవల్లో మేటిగా నిలుస్తుందన్నారు. నర్ర నవీన్ యాదవ్, రఘువీర్ యాదవ్, కావటి రమేశ్ యాదవ్, మహేందర్, మహేశ్, రామన్న పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...