చాకలి ఐలమ్మ ఆదర్శం


Mon,April 22, 2019 02:27 AM

లోకేశ్వరం : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు వీరనారి చాకలి ఐలమ్మను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని చాకలి ఐలమ్మ మనుమడు రామచంద్రయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కనకాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకునేందుకు రజాకార్లతో పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐలమ్మను తప్పకుండా గుర్తించి ట్యాంక్‌బండ్‌పై విగ్రహం పెట్టేందుకు ప్రభుత్వ ఆలోచనలో ఉందని ఆయన గుర్తు చేశారు. రజకులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. కనకాపూర్‌లో రజక సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. గ్రామంలో దోభిఘాట్, రజకులకు ప్రత్యేక సబ్సిడీ రుణాలను ఇప్పించేందుకు తనవంతుగా కృషి చేస్తానని అన్నారు.

ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని పిల్లలను గురుకుల పాఠశాలలో చదివిస్తే ఆ తరువాత ఉన్నత చదువులు పూర్తయ్యే వరకు అందులోనే అవకాశం ఉంటుందని ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. అనంతరం రామచంద్రయ్య మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని, ఐలమ్మ జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తే ఐలమ్మకు తగిన గౌరవం ఇచ్చిన వారవుతారని అన్నారు. దేశంలో 18 రాష్ర్టాల్లో రజకులు ఎస్సీలుగా గుర్తించినప్పటికీ తెలంగాణలో బీసీలుగా గుర్తించారని అన్నారు. వారిని ఎస్సీలుగా గుర్తించాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీని కేటాయించి రజకుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకెట పోశెట్టి, మైసేకర్ సాయిలు, సర్పంచ్ సాలాయి నరేశ్, ఆనంద్‌రావు పటేల్, నిజామాబాద్ నాయకులు తులసి, సుదర్శన్, మండల నాయకులు ఓరుగంటి శ్రీనివాస్, గంగాధర్, బాబన్న, చిన్నయ్య, ఆంజనేయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...