ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల ప్రతిభ


Fri,April 19, 2019 11:54 PM

నిర్మల్ అర్బన్/ నమస్తే తెలంగాణ: ఇంటర్ ఫలితా ల్లో ప్రభుత్వ కళాశా లల విద్యార్థులు ప్రతిభను చాటారు. జిల్లాకేంద్రంలోని సోఫినగర్ ప్రభుత్వ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నీరడి గంగాశంకర్ తెలిపారు.తొలిసారిగా టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత పొంది ప్రథమ సంవత్సరం చదువుకున్న విద్యార్థులు మంచి మార్కులను సాధించారన్నారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. బైసీసీలో 39 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 38 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ విభాగంలో మార అశ్విత 459/470 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచారు.ప్రసన్న 456, సుచరిత 456, తేజశ్రీ 451, శివాణి 450, మనీష 450, శ్రీలేఖ 450 మార్కులు సాధించారు.బైపీసీ విభాగంలో...విఖిత 426/440 మార్కులతో జిల్లా స్థాయి మార్కులు సాధించింది. ప్రత్యూష 420, హరిప్రియ శ్రీవాణి 416, వినీల 415, అషీఫ షరీన్ 414,అఖిలశ్రీ 413, అంజని 413, వైష్ణవి 413,యమున 410 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకులను సాధించుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంటర్ తరగతులు ప్రారంబించిన మొదటి సంవత్సరంలోనే తమ కళాశాల విద్యార్థులు ప్రైవేటు,కార్పొరేట్ కళాశాలలకు దీటుగా మార్కులు సాధించారన్నారు.

కేజీబీవీలో..77.5 శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని కేజీబీవీ కళాశాల్లో విద్యార్థులు మంచి ప్రతిభను కనబర్చినట్లు కేజీబీవీ సెక్టోరియల్ అధికారి సలోమ కరుణ తెలిపారు. జిల్లాలో భైంసా, కడెం, దిలావర్‌పూర్ మండల్లో మూడు కేజీబీవీ కళాశాలు ఉన్నాయి. ఇందులో భైంసా కేజీబీవీలో ఎంపీసీలో 28 విద్యార్థులకు 18 విద్యార్థులు పాసయ్యారు.బైపీసీలో 52మంది విద్యార్థులకు 15మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కడెంలో...ఎంపీహెచ్ డబ్ల్యూలో 36మంది విద్యార్థులకు 36 మంది ఉత్తీర్ణులవ్వగా 473/500 మార్కులకు ప్రియాంజలి అత్యధిక మార్కులు సాధించింది. సీఈసీ విభాగంలో 37 మందికి 34 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవ్వగా 463/500 మార్కులతో తనుశ్రీ అత్యధిక మార్కులు సాధించింది. దిలావర్‌పూర్‌లో ఎంపీసీలో 23మంది విద్యార్ధులకు 22 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. బైపీసీలో 36 మందికి 29 మంది విద్యార్థులు పాసైనట్లు అధ్యాపకులు తెలిపారు.

ప్రభుత్వ బాలికల కళాశాలలో..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ విభాగాల్లో మొత్తం 239 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 135 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఎంపీసీలో 65శాతం ఉతీర్ణత సాధించగా, బైసీసీలో 57 శాతం, సీఈసీ, హెచ్‌ఈసీలో 52 శాతం ఉత్తీర్ణత సాధించగా మొత్తం 56 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో ఎంపీసీ సుజన 380/470, జి.రంజిత 390/470, సీఈసీ ముస్కాన్413/500, హన్షిక 452/500, హెచ్‌ఈసీలో గంగామణి 410/500 మార్కులు సాధించారు.

ద్వితీయ సంవత్సరంలో..
మొత్తం 157 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 104 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 69.3 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో ఎంపీసీలో శైలజ 887/100, కావేరి 817, మిస్బా 921, బైపీసీలో ఆర్.సోని 942, సీఈసీలో నేహ 927, ఆర్ష 906, హెచ్‌ఈసీలో గంగాసాగర్ 864 ప్రతిభ కనబర్చారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...