వైభవంగా హన్‌మాన్ జయంతి


Fri,April 19, 2019 11:54 PM

ఖానాపూర్: హనుమాన్ జయంతి వేడుకలను శుక్రవా రం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. హన్‌మాన్ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి పంచామృతాలు, నవరసాలతో అభిషేకాలు, సిందూర లేపనాలు చేపట్టారు. పట్టణంలోని శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు నిమ్మగడ్డ సందీప్ శర్మ ఆధ్వర్యంలో సుప్రభాత సేవను చేపట్టి జయంతి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆంజనేయునికి తమలపాకులతో ఆకు పూజలు చేసారు. మహా గణపతి పూజ, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ యాగశాలలో హోమం జరిపించారు. శ్రీలక్ష్మివేంకటేశర స్వామి ఆలయ స్థానాచార్యులు చక్రపాణీ వాసుదేవాచార్యులు విశేష పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ అర్చకులు నిమ్మగడ్డ సందీప్ శర్మను సన్మానించారు. ఎంపీపీ ఆకుల శోభారాణి ఆలయ ప్రాంగణంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. జంగల్ హనుమాన్ ఆలయంలో రామోఝల రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ జయింతి నిర్వహించారు. అర్చకులు శశిధర్ శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు బక్కశెట్టి కిశోర్, అశోక్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రసన్నాంజనేయ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఒడ్డెవాడ ఆంజనేయునికి దాత ఇత్తడి గదను బహూకరించారు. పెంబి మండలంలోని పలు గ్రామాల్లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. దస్తురాబాద్ మండలంలోని వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకుడు నరసింహచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మండలంలోని చెన్నూరు గ్రామంలోహోమం, యజ్ఞాలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు వంశీకృష్ణ రామచార్యులు ప్రత్యేక హనుమదోమము,గణపతి పూజ,దేవతరాధన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భజరంగ్‌దళ్ యూత్, యువకులు, స్వాములు ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహంతో ఊరేగిం పు చేపట్టారు.

కడెం మండలంలోని పాండ్వాపూర్, కొండుకూర్, పెద్దూర్, బెల్లాల్, ధర్మాజిపేట, మాసాయిపేట, లింగాపూర్, చిట్యాల, తదితర గ్రామాల్లో జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాండ్వాపూర్ ఆలయం వద్ద ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. మాలధారణ వేసిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొండగట్టుకు బయలుదేరారు. రామాలయంలో ఖానాపూర్ సీఐ ఆకుల అశోక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు స్థానిక భక్తులు దేవుని చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...